శ్రీనివాసుడికి గోవింద నామం రావడం వెనుక ఉన్న మరో కథేంటంటే..

శ్రీనివాసుడిని గోవింద అని ఎందుకు పిలుచుకుంటామో చెప్పేందుకు ఒక తెలుసుకున్నాం. ఆ కథ తిరుమల మహత్యాన్ని వివరించే వేంకటాచల మహత్యంలోనిది. అయితే దీనికి సంబంధించి మరో కథ కూడా ఉంది. ఈ కథలో శ్రీనివాసుడు అగస్త్యునితో తనకు గోవిందా నామం ఎంతో ప్రియమైనదని చెప్పినట్లుగా ఉంది కదా.. ఆ నామమే స్థిరపడిపోతుందని.. భక్తులంతా తనను అలాగే పిలుస్తారని చెప్పాడు. అంటే శ్రీనివాసునికి ఈ గోవిందా నామం ఇంతకు ముందే ఉందా? అనే సందేహం రాక మానదు. ఇందుకు ఆధారంగా బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవత గాథను కూడా తెలుసుకుందాం.

ద్వాపర యుగంలో గోకులంలో ఒకసారి ఇంద్రుడు ఏడు పగళ్లు ఏడు రాత్రుళ్ళు రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఆ కుంభవృష్టి ధాటికి గోకులంలోని వారితో పాటు పశుపక్షాదులంతా అల్లాడిపోతారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద నిలిపాడని కూడా తెలిసిందే కదా. అప్పుడు గోకులంలోని వారంతా పశుపక్షాదులు సహా గోవర్థనగిరి కిందకు చేరి ప్రాణాలను నిలుపుకున్నాయి. ఆనాడు గోవులను కాపాడినందుడు శ్రీకృష్ణుడు గోవిందుడనే నామంతో కీర్తి పొందాడని ప్రతీతి. అదే తరువాత కలియుగంలో శ్రీనివాసునికి ఇష్టమైన నామంగా మారిందని చెబుతారు.

Share this post with your friends