సంకట హర చతుర్థిని ఈ నెల 8న జరుపుకోనున్నాం. శ్రావణ మాసంలోని ఈ సంకట హర చతుర్థికి చాలా ప్రాధాన్యముంది. దీనికి తోడు అదే రోజున మూడు శుభ యోగాలు ఏర్పడనుండటం విశేషం. అవేంటంటే.. సిద్ధి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం కలయిక జరగనుంది. ముందుగా సంకట హర చతుర్థి నాడు సర్వార్వ సిద్ధియోగం ఏర్పడనుంది . ఆ తరువాత వరుసగా మిగిలిన రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండడంతో పాటు వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయట. వినాయక చతుర్థి రోజున ఉదయం 5.47 నుంచి 11.34 గంటల వరకు రవియోగం ఉంటుంది.
ఇక ఉదయం నుంచి మధ్యాహ్నం 12:39 గంటల వరకు శివయోగం.. ఆ తర్వాత సిద్ధయోగం ఏర్పడుతుంది. ఆ రోజున వినాయకుడికి దర్భలను సమర్పించి మోదకాలు, లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున ఓం గం గణపతియే నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిదట. అంతేకాకుండా ఇవాళ శమీ వృక్షాన్ని పూజించినా కూడా చాలా మంచిదట. జమ్మి ఆకులను గణపతికి సమర్పిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఆ రోజున వినాయకుని ముందు నాలుగు దీపాలును వెలిగిస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతామట. ఇక రాత్రికి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన అనంతరం ఉపవాసాన్ని విరమించవచ్చు.