శ్రీశైలం (నంద్యాల జిల్లా) : వేడుకగా శ్రీభ్రమరాంబికా అమ్మవారికి వార్షిక కుంభోత్సవం. వేదోక్తంగా అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు. సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పణ. నేటి సాయంత్రం అమ్మవారి ఆలయ సింహమండపం వద్ద అన్నపురాశి సమర్పణ, ప్రదోశకాల పూజల అనంతరం మల్లికార్జునస్వామి అన్నాభిషేకం, స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి ఇవ్వనున్న ఆలయ ఉద్యోగి. కుంభహారతి సమయంలో భ్రమరాంబాదేవికి పసుపు, కుంకుల సమర్పణ.
2024-04-26