నేటి నుంచి శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే రేపు తిరుమంజనం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 18 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జూన్ 17వ తేదీన రాత్రి 7:30 గంటలకు రంగనాథ స్వామి వారి తిరుకల్యాణం జరగనుంది. ఈ నెల 18న మహా పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నాలుగు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏ రోజన ఏ ఏ కార్యక్రమాలు జరగనున్నాయంటే..

నేడు అభిషేకం, తిరుమంజనం, ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ

16న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, గరుడముద్ర భేరీపూజ, దేవతా ఆహ్వానం

17న గోదాదేవి సమేత రంగనాథస్వామి కల్యాణోత్సవం

18న మహాపూర్ణాహుతి, చక్రస్నానం

Share this post with your friends