ఇవాళ్టి నుంచి అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 616వ జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ జయంతి ఉత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణం నిర్వ‌హిస్తారు.

నేటి నుంచి 25వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. అలాగే తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మే 24 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచిడి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వ‌హిస్తారు. మే 23 నుంచి 29వ తేదీ వ‌రకు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Share this post with your friends