‘తిండిమొండయ్య నైవేద్య ప్రియుడు’ అంటూ అన్నమయ్య ఆటపట్టించేవాడట..

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు..నైవేద్య ప్రియుడు కూడా అన్న విషయం భక్త కోటికి తెలిసిందే. స్వామివారికి నిత్యం ఎన్నో నివేదనలు అర్చకులు చేస్తుంటారు. వీటన్నింటిలోనూ శ్రీ మలయప్ప స్వామివారికి అత్యంత ఇష్టమైనది లడ్డూ ప్రసాదమే. అన్నమయ్య తొలిసారి తిరుమలను దర్శించినప్పుడే శ్రీ వేంకటేశ్వర స్వామివారిని.. ‘తిండిమొండయ్య నైవేద్య ప్రియుడు’ అంటూ ఆట పట్టించేవాడట. ప్రస్తుతం శ్రీవారి లడ్డూ ప్రసాదం మాధుర్యానికి 310 ఏళ్లు నిండింది.

ఆ రోజుల్లో కొండమీద ఎలాంటి ఫుడ్ స్టాల్స్ కానీ.. భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవట. ఇక భక్తులకు ఆ రోజుల్లో అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు. ఆ తర్వాత సుఖీయం మనోహరపడి వంటి ప్రసాదాలను సైతం ప్రవేశపెట్టారు. ఇక స్వామివారికి వడ కూడా ప్రసాదంగా అందించేవారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాక పోవడంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అప్పట్లో లడ్డూను ప్రసాదంగా ఇచ్చేవారు కాదన్న విషయం తెలిసిందే. తొలుత బూందీని ప్రసాదంగా అందించేవారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత 1940 నుంచి లడ్డూను ప్రసాదంగా అందించేవారు.

Share this post with your friends