లీలావతారాల్లో శ్రీకృష్ణావతారం ఎన్నవదంటే..

విశ్వరూపం అంటే ప్రపంచ చరిత్రను ఒక తెరపై చూసినట్లు అవగాహన చేసుకోవడం. మనం సాధారణంగా వర్తమానాన్ని మాత్రమే చూస్తూంటాం. అలాకాకుండా చరిత్ర మొత్తాన్ని, రాబోయే కాలాన్ని చూడటమే ఈ దర్శనం. అన్నీ మంచే చూడాలని మనం సాధారణంగా కోరుకుంటాం. కొన్ని భయంకర సత్యాల్ని చూడడానికి ఇష్టపడం. మంచి చెడు అన్నింటినీ నిర్లిప్తతతో చూడడమే విశ్వరూప దర్శనం. మొదట్లో అర్జునుడు కృష్ణుడితో ‘నన్నెందుకు ఈ ఘోరమైన కార్యానికి వినియోగిస్తున్నావు?’ అని అడిగాడు. శ్రీకృష్ణుని విశ్వరూపం దర్శనం తర్వాత అతని ప్రశ్నకు సమాధానం దొరికింది. అనంతమైన కాలచక్రంలో తాను ఒక చిన్న ముక్కను మాత్రమే అని, నిమిత్త మాత్రుడనే అని.

లీలావతారాల్లో శ్రీకృష్ణావతారం ఎన్నవదంటే..
లీలావతారాల్లో శ్రీకృష్ణావతారం ఎన్నవదంటే..

తన ధర్మాన్ని అర్థం చేసుకుని కర్తవ్యాన్ని చేయడమే కర్మ యోగమనే పేరిట అర్జునుడికి చెప్పిన పాఠం. ప్రపంచం అనే కురుక్షేత్రంలో అంటే కార్య క్షేత్రంలో మనందరికీ వర్తించే పాఠమే ఇది. మనకు తెలిసిన దశావతారాల లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి ఎనిమిదో అవతారం. ధర్మం గాడి తప్పి లోకంలో అల్లకల్లోలం సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఐన శ్రీమహావిష్ణువు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు. శ్రీకృష్ణుడి అవతారం కూడా లీలావతారమే!

భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు. వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది. లీలావతరాల్లోని ముఖ్యమైన పదింటినే పురాణాలు దశావతారాలుగా చెబుతున్నాయి.

Share this post with your friends