ముల్లోకాల సకల తీర్థాలు ఇక్కడే ఉంటాయట.. ఈ జలంలో స్నానమాచరిస్తే..

మనం తిరుమలకు వెళ్లినప్పుడు కపిల తీర్థాన్ని చూస్తూనే ఉంటాం. కొందరు వెళ్లి దర్శించుకుంటారు. మరికొందరు తర్వాత వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇక్కడి సుందరమైన జలపాతం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ జలపాతంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొగలిపోతాయట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు నాలుగు గంటలపాటు కపిల తీర్థంలోకి వచ్చి చేరుతాయని ప్రతీతి. ఆ సమయంలో స్నానమాచరిస్తే మాత్రం పాపాలన్నీ మాయమవుతాయట.

ఇక స్నానమాచరించిన అనంతరం మరో పని చేస్తే చాలా పుణ్యమట. అదేంటో తెలుసా? నువ్వు గింజంత అయినా బంగారం దానమివ్వాలట. అలా చేస్తే కొండంత పుణ్యం లభిస్తుందట. అందుకే కార్తీక మాసంలో తిరుమలకు వెళ్లిన వారు తప్పక కపిల తీర్థానికి వెళతారు. కపిలతీర్థంలో స్నానమాచరించిన అనంతరం పరమేశ్వరుడికి దీపాలు వెలిగిస్తారు. శివుడికి ప్రీతికరమైన ఆరుద్రా నక్షత్రం రోజున ఇక్కడ విశేషమైన పూజలు.. ఇక కార్తీకంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిళ్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. ఈ అన్నాభిషేక ఉత్సవాన్ని కళ్లారా చూసి కొంచెం అన్నాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఎలాంటి రోగాలైన పోతాయని నమ్మకం.

Share this post with your friends