తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పోటు పెష్కార్ శ్రీ శ్రీనివాసులుతో పాటు అడిషనల్ ఈవో లడ్డూ కాంప్లెక్స్‌ను సందర్శించి దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజివో శ్రీ నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
2024-08-06