శాస్త్ర ప్రకారమైతే ‘కాయో పేక్ష’ గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలి. కానీ మనం కాయో, ఫలమో అని చెప్పుకుంటున్నాం. అలాగే ఫలాపేక్ష వదిపెట్టాలని వాస్త్రం చెబుతోంది. అంటే మనం చేసే కర్మఫలంపై ఆపేక్ష విడిచి పెట్టాలని అర్తం అంటే మనం ఏ పని చేసినా కూడా దానిని భగవంతునికి అర్పించినట్టుగా భావించి చేయాలట. ఏమాత్రం కూడా ప్రతిఫలాన్ని ఆశించకూడదట. అంటే చితిలో కాలిపోయే ఈ కాయంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకోవాలని శాస్త్రం చెబుతోంది.
కాలక్రమేణా జన వ్యవహారంలో ఇది కాస్త కాయ లేదా పండుగా మారిపోయింది. కాబట్టి అక్కడికి వెళ్లినవారంతా కాయో.. ఫలమో వదిలేసి వస్తున్నారు. మనకు ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యం ఏం ఉంటుంది? క్షేత్ర దర్శనం చేస్తే మనకు నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం రావాలి కానీ పండునో.. కాయనో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. కాశీకి వెళితే కేవలం భగవంతునిపై మనసు లగ్నం చ చేయాలి. కానీ మన ధ్యాస అంతా ఎక్కువగా గంగలో వదిలేసే వస్తువులపైనే ఉంటుంది. అలా వదిలేసి వస్తే ఏదో జరుగుతుందని నమ్మకం. కాబట్టి ఇకమీదటైనా కాశీకి వెళ్లేవారు విశ్వనాథుని దర్శనం మనస్ఫూర్తిగా చేసుకుని రండి.