హిందూ పురాణ గ్రంథాల్లో గరుడ పురాణం ఒకటి. దీని అధిదేవత విష్ణుమూర్తి. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గ్రంథాల్లో ఇది ఒకటి. మనం జీవించేందుకు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ గ్రంథంలో ప్రస్తావించారు. ఏ పనులు చేయకూడదు? వేటిని చేయాలి? వంటివన్నీ దీనిలో వివరించారు. తెలిసీ తెలియక చేసిన తప్పులు ఆయుష్షుని తగ్గిస్తాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏ పనులు చేయకూడదో చూద్దాం. బారెడు పొద్దెక్కే వరకూ పడుకోకూడదట. ఇలాంటి అలవాటుంటే తక్షణమే మార్చుకోవాలట. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే స్వచ్ఛమైన గాలిని స్వీకరించవచ్చు. తద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ.
మరణించిన వ్యక్తి దేహాన్ని దహనం చేసినప్పుడు వెలువడే పొగకు దూరంగా ఉండాలి. ఈ పొగలో విషపూరితమైన అంశాలు గాలిలో వ్యాపించి అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి శ్మశాన వాటిక పక్కనే ఇల్లు నిర్మించుకునేందుకు సైతం వెనుకాడుతారు. ఇక రాత్రిపూట పెరుగు తినకూడదట . రాత్రిపూట పెరుగు లేదంటే పెరుగుతో చేసిన వస్తువులు తినడం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయట. దక్షిణ, పడమర దిశలో తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. అలాగే విరిగిపోయిన మంచంపై నిద్రించకూడదు. పడక గదిలోకి ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా గదిలో కాంతి ఉండాలి. పడుకున్న తర్వాత మాత్రం గది చీకటిగా ఉండాలట. ఇవన్నింటినీ పాటిస్తే మరణ భయం అంత త్వరగా దరి చేరదని గరుడ పురాణం చెబుతోంది.