ఆడికృత్తిక పర్వదినం నిన్న అన్ని ఆలయాల్లో పెద్ద ఎత్తున జరిగింది. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన, తిరుమల కు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది.