సముద్రంలోని రాతిపై ఆలయం.. ఇక్కడి హిందువులకు ఇదో పవిత్ర ప్రదేశం

భారతదేశంలోనే కాదు.. ఇతర కొన్ని దేశాల్లోనూ హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలా భారతదేశం వెలుపల దేవాలయాల గురించి చెప్పుకోవల్సి వస్తే ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం చెప్పాలి. ఇక్కడ హిందువులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడి తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలోని కొండపై ఓ ఆలయం ఉంటుంది. సముద్రంలోని రాతిపై ఆలయం అంటేనే ఒక అద్భుతంలా అనిపిస్తుంది కదా. ఇక్కడి ఆలయాన్ని తనాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం చాలా అందంగా ఉంటుంది.

అలాగే సూర్యాస్తమయ దృశ్యాలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. బాలినీస్ హిందువులకు ఇదొక ముఖ్యమైన ప్రార్థనా స్థలం. తనహ్ లాట్ ఆలయ సహజ సౌందర్యం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయాన్ని సముద్ర సంరక్షక దేవతకు స్థానిక హిందువులు అంకితం చేశారు. దీని ప్రత్యేకత.. అందంతో బాలిలో పర్యటకులకు స్వర్గథామంలా ఇది మారిపోయింది. ఈ ఆలయం తీర ప్రాంతం నుంచి కేవలం 20 మీటర్లు (65.6 అడుగులు) దూరంలో ఉంటుంది. అలాగే ఈ ఆలయం ఏదో కొద్ది ప్రదేశంలో నిర్మించబడలేదు. ఏకంగా 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాతిపై నిర్మించబడింది.

Share this post with your friends