తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీలో మోదీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే..

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ఇప్పటి వరకూ ఏ తెలుగు ప్రధాని కూడా తెలుగు మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అంతెందుకు ముఖ్యమంత్రులే పెద్దగా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. అదెప్పుడుగో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఓ ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే అది చాలా పెద్ద విషయం ఆ ఘనత ఎన్టీవీకే దక్కింది. నేడు ప్రధాని మోదీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు. గతంలో భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు.

ఒక తెలుగు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని హాజరవడం అదే మొదటి సారి. ఇప్పుడు ఏకంగా ఇంటర్వ్యూనే ఇవ్వనున్నారు. సాధారణ సమయాల్లోనే మోదీ ప్రత్యేకంగా ఏ నేషనల్ ఛానల్‌కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. అలా చూసుకున్నా కూడా ఎన్టీవీ దేశ టెలివిజన్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తున్నట్టు. ఇక ప్రస్తుతం మోదీ మహారాష్ట్రలోని నందూర్బార్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15గంటలకు మహబూబ్ నగర్ లోని ఎన్నికల సభ అనంతరం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం పూర్తైన అనంతరం మోదీ భువనేశ్వర్ వెళ్లనున్నారు.

Share this post with your friends