మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలోని కైలాస-పహర్‌ఘర్ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొండలలో ఉన్న వనదేవత భవానీ ఆలయంలో కొలువైన అమ్మవారిని ‘భరరేవాలి మాత’గా పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహ పరిమాణం నవరాత్రులలో పెరుగుతుందని ముందుగానే చెప్పుకున్నాం. ఈ ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి. పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ కుల దేవతని ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడి అమ్మవారికి ఆలయాన్ని 1621లో ఖండేరావ్ భగత్ బహారా అనే భక్తుడు నిర్మించాడని చెబుతారు.
ఇక ఈ ఆలయంలోని విగ్రహ పరిమాణం నవరాత్రులలో పెరుగుతుంది కదా.. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఇక నవమి రోజున అమ్మవారి మూల విరాట్టును గర్భ గుడి నుంచి తీసుకొస్తారు. భరరేవాలి మాత ఆలయంలో మరో విశేషం ఉంది. అదేంటంటే.. ఈ ఆలయంలో ఒక సరస్సు ఉంటుంది. ఈ సరస్సులోని నీరు ఎప్పటికీ ఎండిపోదు. పైగా ఈ నీటిని సేవిస్తే మనం చేసిన సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం.