నాగదేవత విగ్రహంపై నాగు పాము.. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు

తెలంగాణలోని పెదపల్లి జిల్లాలోని ఒక శివాలయంలో ఆశ్చర్యం కలిగించే ఘటన చోటు చేసుకుంది. హిందువులు దేవతగా భావించి పూజించే నాగు పాము.. నాగ దేవత విగ్రహాన్ని చుట్టేసుకుని చాలా సేపు విగ్రహంపై నుంచి కదల లేదు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో చోటు చేసుకుంది. అక్కడ నాగ దేవత విగ్రహాన్ని ఓ నాగుపాము చుట్టేసుకుని పడగ విప్పింది. విషయం తెలుసుకున్న భక్తులు ఆ వింత చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అయినా సరే.. పాము మాత్రం ఆ విగ్రహాన్ని వదలకుండా అలాగే పట్టుకుని ఉంది.

నాగ పంచమికి ముందు ఇలా జరగడం అంతా దేవుడి మహిమేనని భక్తులంతా భావిస్తున్నారు. విగ్రహం వద్ద కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. అయినా సరే పాము అక్కడి నుంచి కదలలేదు. పడగ విప్పి అటు ఇటు తిరిగింది తప్ప అక్కడి నుంచి మాత్రం కదల్లేదు. ఇదంతా శివుడి మహిమేనని అంతా అంటున్నారు. ఇక పాము ఎంతకీ అక్కడి నుంచి వెళ్లకపోవడంతో భక్తులు వెళ్లగొట్టే యత్నం చేశారు. అయినా సరే పాము మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. దీంతో అక్కడ ఉన్న వారు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా.. వారు దానిని పట్టుకొని వెళ్లి దూర ప్రాంతంలో వదిలి పెట్టి వచ్చారు.

Share this post with your friends