ఆకాశంలో అద్భుతాలకు కొదువేమీ ఉండదు. అయితే అవి మన కంటికి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. చూపరులను మంత్ర ముగ్ధులను చేసే సంఘటన ఒకటి ఆకాశంలో జరగబోతోంది. ఈ ఏడాది మొదట ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. అదెప్పుడో కాదు ఈ ఏడాది ఫిబ్రవరి 28న. రిపబ్లిక్ డే సందర్భంగా సాయుధ బలగాలు కవాతు నిర్వహిస్తుంటాయి. ఫిబ్రవరి 28న అలాంటి కవాతునే గ్రహాలు నిర్వహించనున్నాయి. ఆరు గ్రహాలకు మనకు ఒకే వరుసలో దర్శనమివ్వనున్నాయి. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు ‘ పరేడ్ ఆఫ్ ప్లానెట్స్’ లేదా ‘గ్రహాల కవాతు’గా పిలుస్తున్నారు.
ఫిబ్రవరి 28న ఈ అద్భుతం ఆకాశంలో మనకు దర్శనమివ్వనుంది. కుజ, గురు, నెప్ట్యూన్, శని, యురేనస్, శుక్ర గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. వీటిలో నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు బైనాక్యులర్స్, టెలిస్కోపు ద్వారా మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి అద్భుతాన్ని మనం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 400 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడికి ఒకవైపు ఈ గ్రహాల అమరిక జరగనుందట. ఇటువంటి సందర్భం తిరిగి 2492వ సంవత్సరంలో మాత్రమే వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.