అగ్రరాజ్యం అమెరికాలో అభయాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. అమెరికాలోనే ఇది మూడో అతి పెద్ద విగ్రహం కావడం విశేషం. హ్యూస్టన్ నగరంలో ఇది అలరిస్తోంది. 90 అడుగులతో అమెరికాలోనే అతి పెద్ద విగ్రహం కావడం విశేషం.అమునిరాలెపి హ్యూస్టన్ నగరం భక్తి భావంతో ఉర్రూతలూగుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అంకురార్పణ ఆగస్టు 15న జరిగింది. అనంతరం ఆగస్టు 16న వాస్తుపూజ, జలాధివాసం, వరలక్ష్మీ పూజ కార్యక్రమాలు దివ్యంగా జరిగాయి.
అనంతరం సుందరకాండ పారాయణం, అగ్ని ప్రతిష్ఠ, హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఆగస్టు 18న అంటే ఇవాళ విగ్రహ ప్రతిష్టపన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మొత్తానికి హ్యూస్టన్ నగరంలో యావత్ భక్తకోటి ఎదురుచూస్తున్న మహాద్భుత ఘట్టం అయితే నేడు ఆవిష్కృతం కానుంది. మహాపూర్ణాహూతి, మహా కుంభ సంప్రోక్షణ క్రతువులతో..హ్యూస్టన్‌లోని దివ్య అష్టలక్ష్మీ ఆలయంలో..భవ్యమైన అభయాంజనేయ స్వామి విగ్రహానికి.. ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. అనంతరం 90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ మహా విగ్రహాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి లోకార్పణం గావిస్తారు..!