
హిందూ మతంలో ప్రతి ఒక్క రోజుకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలోనే శరత్ పూర్ణిమను కూడా మనం ఒక పండుగలా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమిని శరత్ పూర్ణిమ పండుగగా జరుపుకుంటాం. మరి శరత్ పూర్ణిమ ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజున మనం ఎవరిని పూజించుకుంటామనే విషయాలను తెలుసుకుందాం. శరత్ పూర్ణిమ రోజున రాధాకృష్ణులతో పాటు శివపార్వతులను, లక్ష్మీదేి, చంద్రుడిని పూజించుకుంటాం.
శరత్ పూర్ణిమ రోజున చంద్రుడు 16 కళల్లో ప్రకశిస్తాడని నమ్మకం. అలాగే ఈ రోజున చంద్రుని కిరణాలలో అమృతం ఉంటుందని నమ్మకం. ఇక పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. అక్టోబర్ 16 బుధవారం రాత్రి 08:41 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే గురువారం అక్టోబర్ 17 సాయంత్రం 04:53 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శరత్ పూర్ణిమ పండుగను అక్టోబర్ 16న జరుపుకుంటాం. ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు చంద్రోదయం జరుగుతుంది.
