టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండీ శ్రీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. 16 ద్విచక్ర వాహనాలలో 15 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ శ్రీ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారికి రెండు రోజుల క్రితం భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని.. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లారీని విరాళంగా అందజేసింది. లారీ చేసేస్‌కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఇక నిన్న ఏకంగా 16 ద్విచక్ర వాహనాలను అందజేయడం జరిగింది.

Share this post with your friends