బోనాల జాతరకు సిద్ధమవుతున్న జంట నగరాలు

ఆషాడం వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే మనం జాతర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ సమయంలో హైదరాబాద్‌లో వారానికోసారి పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతుంది. అమ్మవారిని తమ ఇంటి బిడ్డగా భావించి అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువస్తారు. అనంతరం ఎంతో అందంగా అలంకరించి ధూప నైవేద్యాలతో.. సారెతో తిరిగి అత్తింటి వారికి పంపిస్తారు. అమ్మవారిని పుట్టింటికి సాదరంగా ఆహ్వానించి తిరిగి వైభవంగా అత్తారింటికి పంపడమే ఈ బోనాల పండుగ. అలాగే వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి పంటలన్నీ బాగా పండి రైతులంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకునే పండుగే బోనాలు.

ఆషాఢమాసంలోని తొలి ఆదివారం బోనాల పండుగ ప్రారంభమవుతుంది. గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఏడాది బోనాల పండుగ జూన్ 26వ తేదీ నుంచి బోనాల వేడుక ప్రారంభం కానుంది. తిరిగి జూలై 26 వరకూ ఈ బోనాల జాతర జరుగనుంది. జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం.. అలాగే జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.. జులై 14న రంగం భవిష్యవాణి.. జులై 20న భాగ్యనగర లాల్ దర్వాజా బోనాలు.. జులై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు.. 24న బోనాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.

Share this post with your friends