
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే.. అన్నం భగవంతుడితో సమానమన్నమాట. అంటే దయాగుణాన్ని కలిగి ఉండాలట. ఎవరికైనా అన్నదానం చేస్తే దానికి మించినది మరొకటి లేదు. అలాగే మనం కూడా ఆహారాన్ని నిర్లక్ష్యంగా చూడకూడదు. పొరపాటున కూడా ఆహారాన్ని తొక్కకూడదు. భిక్షగాడు నీముందు చేయి జాపాడంటే… “బాబూ! నాగతి నీకు పట్టకుండా చూసుకో. పూర్వం నేను పిసినారి కావడంచేతనే నాకీ గతి పట్టింది. కనుక, నీవు దయాగుణంతో దాతవు కావాలి” అని హెచ్చరిస్తున్నాడని భావించాలట.
కోటి విద్యలు కూటికొరకే! మనము అన్నమును శుభ్రమైన పాత్రలో వండి భుజించగా మిగిలినది ఏ మురికి కాల్వలోనో, మట్టిలోనో, ముండ్ల కంపలోనో పడవేయరాదు. మనకు ఎక్కువై పడవేయునది కొందరికి లేక తపిస్తున్నారని తెలుసుకొని పరిశుభ్రమైన చోట ఏదైనా రాతిపై వేసినచో కనీసం పశువులో, పక్షులో తిని ఆనందిస్తాయని గుర్తించి వర్తించాలి. ‘అన్నం పరబ్రహ్మస్వరూపం”. మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాన్ని అహంకారంతో, అగౌరవంగా ఏమాత్రం వృథా చేయకూడదని చెబుతారు.
