పదునాలుగు భువనాలు చూసి జన్మధన్యత పొందిన యశోదమ్మ

వసుదేవుడు తన కుమారుడిని యశోదమ్మ దగ్గర వదిలాడు. యశోదమ్మకు జన్మించిన ఆడబిడ్డను తీసుకుని చెరసాలకు చేర్చాడు. అప్పుడు కంసుడు.. దేవకికి పుట్టింది ఆడబిడ్డేనని సంహరించబోతే ఆ పాప యోగమాయగా మారి ‘నిన్ను సంహరించేవాడు గోకులంలో పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమైంది. ఆ పాప అక్కడ మాయమై వింద్య పర్వతానికి ఎగిరిపోయింది. అనంతరం ఆమే వింధ్యవాసిని దేవిగా ప్రసిద్ధి చెందింది. యశోదమ్మ చెంత పెరిగిన కన్నయ్య.. ఆకట్టుకునే రూపం, నవ్వుల్లో చిలిపితనం, కళ్లల్లో ప్రేమతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేవాడు. అప్పట్లో చిన్ని కృష్ణుని బాల్య క్రీడలను ఆస్వాదించని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదని చెబుతారు.

పదునాలుగు భువనాలు చూసి జన్మధన్యత పొందిన యశోదమ్మ
పదునాలుగు భువనాలు చూసి జన్మధన్యత పొందిన యశోదమ్మ

ఇక తల్లిగా యశోదమ్మ ఎంత పుణ్యం చేసిందో కానీ సాక్షాత్తు భగవంతుడిని తన ఒడిలో ఓలలాడించింది. తన చిలిపి చేష్టలను చూసి మురిసిపోయింది. ఎంత ముద్దు చేసినా కన్నయ్యను కంటికి రెప్పలా కాపాడుకుండూ ఉండేది. అలాంటి యశోదమ్మ తల్లులందరికీ ఆదర్శం. పిల్లలు అల్లరి చేయడం సహజమే కానీ అలా వదిలేస్తే పిల్లలు పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే యశోదమ్మ కన్నయ్యను మట్టి తిన్నప్పుడు రోలుకు కట్టేసి శిక్షించింది. కన్నయ్యకు చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోయినా కూడా తప్పు చేసినప్పుడు మాత్రం చెవి మెలేసింది. మట్టి తిన్నప్పుడు క న్నయ్య నోటిలో పదునాలుగు భువనాలు చూసి జన్మధన్యత పొందింది.

Share this post with your friends