
హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో రాఖీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఇక ఈ ఏడాది మనం ఈ పండుగను ఆగస్టు 9, 2025న జరుపుకోనున్నాం. రాఖీ అంటే రక్షణ బంధం. సోదర సోదరీమణులు జరుపుకునే పండుగ ఇది. మన దేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటుంది. అయితే హిందువులు మాత్రమే జరుపుకుంటారా? లేదంటే ఇతరులు కూడా జరుపుకుంటారా? తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా మూడు మతాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇతర రాష్ట్రాలలో అలా కాదుగా.. మరి వారంతా జరుపుకుంటారా? తెలుసుకుందాం.
రాఖీ పండుగ రోజున సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని.. తన కట్టే రాఖీ ఎప్పుడూ తనకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ రాఖీని కడుతుంది. ఈ పండుగను సిక్కు, జైన మతాలకు చెందిన వారు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. జైనుల నమ్మకం ప్రకారం.. 700 మంది జైన సన్యాసులను విష్ణుకుమార్ అనే ముని రక్షించాడట. అందుకు ప్రతిగా వారంతా రాఖీ పండుగను జరుపుకుంటారు.
