
మహా మృత్యుంజయ మంత్రంలో ‘ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్’ అని చెబుతారు. దీనిలో ఉర్వారుక అంటే అర్థం ఏమిటో తెలుసా?
ఉర్వారుక అంటే దోసపండు. మరి దోసపండుకి మృత్యువుకు సంబంధం ఏమిటి? అంటే.. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయ నుంచి విడివడతాడు.
పండిన దోసపండు తొడిమ నుంచి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను.. దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై ఉంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే ఉన్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో ఉంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేని స్థితిలో వుంటాడు… పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదా..
