
రాఖీ పండుగకు పెద్దగా సమయం లేదు. ఇప్పటికే సోదరీమణులంతా రాఖీ కొనుగోళ్లను ప్రారంభించారు. సోదరులంతా గిఫ్టులు తమ సోదరీమణులకు ఏమివ్వాలా? అని తెగ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వస్తువులను సెలక్ట్ చేసుకుని కూడా ఉండొచ్చు. వాస్తవానికి కొన్ని బహుమతులను సోదరీమణులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. అలా ఇస్తే బంధానికే మంచిది కాదట. ఈ విషయాన్ని జ్యోతిష్యం, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ గిఫ్టులు ఏంటి? అనే కదా.. అవేంటో తెలుసుకుందాం. కంచు, గాజు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతిగా ఇవ్వకూడదు. అవి చాలా సున్నితంగా చేజారితే పగిలిపోయేలా ఉంటాయి కాబట్టి అవి బంధాలను బలహీనపరుస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయతే గడియారాలు అనేవి శని గ్రహానికి సంబంధించినవి. కాబట్టి వాటిని బహుమతిగా ఇవ్వకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయట. అలాగే కత్తులు, కత్తెరల వంటి పదునైన వస్తువులను సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతిగా ఇవ్వకూడదు. అలా ఇస్తే అపార్థం, గొడవలు రావొచ్చని నమ్ముతారు. అంతేకాకుండా ఇవి బంధాలను నాశనం చేస్తాయట. నలుపు రంగు దుస్తులను సోదరికి ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం నలుపురంగు అనేది దుఃఖం, చెడు భావాలకు నలుపును సంకేతంగా భావిస్తారు కాబట్టి ఆ రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, మరణించినవారి వస్తువులను వాడటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆ వస్తువులతో ఆ వ్యక్తికి జ్ఞాపకాలు, భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. ఆ వస్తువులను వాడితే ఆ జ్ఞాపకాలు, ప్రతికూల శక్తి ఇంట్లో ప్రవేశిస్తాయి. దీనివల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోకూడదు, వాడకూడదు.
మరణించినవారి వస్తువులు వాడకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని వాడటం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లో ప్రవేశించి, కుటుంబంలో అశాంతికి దారితీస్తుంది. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
