ఆరోగ్యానికి, సూర్యారాధనకు సంబంధం ఏమిటి?

‘ఆరోగ్యం భాస్కరాదిత్యే’ అని చెబుతారు. అంటే ఎవరైతే ఆరోగ్యాన్ని కోరకుంటారో వారు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తిని సేవించాలని అంటారు. అసలు ఆరోగ్యానికి, సూర్యుడికి ఉన్న సంబంధం ఏమిటి? సూర్యనారాయణమూర్తిని సేవిస్తే ఆరోగ్యం ఎలా బాగుంటుంది? అనే సందేహాలు రావొచ్చు. అదేంటంటే.. సకల జీవరాశి మనుగడకు సూర్యరశ్మి చాలా అవసరం. సూర్యుడు కొద్ది రోజుల పాటు రాకుంటే మొక్కలు, జీవులన్నీ నశిస్తాయి. మనుషులు కూడా ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారని సైన్స్ కూడా చెబుతోంది. పురాణాల ప్రకారమైతే దీనికి సంబంధించి ఓ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి, సూర్యారాధనకు సంబంధం ఏమిటి?
ఆరోగ్యానికి, సూర్యారాధనకు సంబంధం ఏమిటి?

సాంబుడు చాలా అందంగా ఉండేవాడట. తన అందం కారణంగా అతను అహంకారంతో ఉండేవాడు. దీంతో కొందరు మునులను, చివరికి దుర్వాస మహర్షిని కూడా అవమానించాడని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల అతనికి కుష్టు వ్యాధి సంక్రమించిందని చెబుతారు. దీంతో శాప విమోచనం కోసం సాంబుడు ఒడిశాలోని చంద్రభాగా నదీ తీరంలో ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై సాంబుని రోగాన్ని నయం చేశాడని చెబుతారు. రోగం తగ్గిన తర్వాత, సాంబుడు సూర్య భగవానుడికి కృతజ్ఞతగా ఒక ఆలయాన్ని నిర్మించాడని ప్రతితీ. ఇదే నేటి ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయంగా భావిస్తారు.

Share this post with your friends