శూర్పణఖ రావణుడి సొంత చెల్లెలా?

శూర్పణఖ రామాయణంలో ప్రముఖ పాత్ర అని చెప్పాలి. ఆమె వల్లనే సీతాపహరణం జరుగుతుంది. ఒక విధంగా అన్నయ్య చావుకు పరోక్ష కారణం శూర్పణఖ అనే చెప్పాలి. శూర్ప + నఖ = శూర్పణఖ. శూర్పము అంటే చాట. చాట వంటి పెద్ద గోళ్ళు పెంచుకొన్న ఆమె. అసలు పేరు వేరే ఉండవచ్చు. ప్రసిద్ధ నామం ఇది. శూర్పణఖ తండ్రి విశ్రవసుడు. ఈయనకు నలుగురు భార్యలు. మొదటి ఆమె ఇలబిల. ఈమె తృణబిందువు అనే ఆయన కూతురు. కుబేరుడు ఈమె సంతానమే. ఈమె వల్ల ఆయనకు ఐలబిలుడు అనే పేరు వచ్చింది.

రెండో ఆమె కైకసి. సుమాలి కూతురు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే ముగ్గురూ ఈమె సంతానం. మూడో ఆమె పుష్పోత్కట . ఈమె కైకసి చెల్లెలే.

మహోదరుడు , మహాపార్శ్వుడు ఈమె సంతానం. నాలుగో ఆమె రాక . ఈమె కూడా కైకసి చెల్లెలే.. ఈమె కూతురు శూర్పణఖ, కొడుకు ఖరుడు. శూర్పణఖ అంటే రావణాసురుడికి చచ్చేటంత ప్రేమేమీ లేదు. శూర్పణఖ మగణ్ణి విద్యుజ్జిహ్వుణ్ణి ఒక యుద్ధంలో చంపేశాడు. పొరపాటున చంపానని ఈ చెల్లితో చెప్పాడు. విభీషణ, కుంభకర్ణుల లాగా కాదు. ఈమె రావణుడి సవతితల్లి సంతానం.

Share this post with your friends