విధి లేకనే ధర్మరాజును యువరాజుగా ప్రకటించారా?

శ్రీకృష్ణుడిని 36వ సంవత్సరాల తర్వాత యాదవ వంశం నశిస్తుందని గాంధారి శపించింది. ఆ 36వ సంవత్సరం రానే వచ్చింది. ఆ సమయంలో ద్వారకకు శ్రీకృష్ణుడి దర్శనం కోసం వస్తూన్న కణ్వ, నారద విశ్వామిత్ర ఋషులను, చూసి పోగాలం దాపురించి ఉన్నందువల్ల జాంబవతికి కొడుకైన’సాంబుడికి’ గర్భవతి వేషం వేసి, యాదవ యువకులు ఆ ఋషులకు అతడి చేత దొంగ దండాలు పెట్టించారు. ‘‘స్వాములూఈ నిండు చూలాలికి ఏ బిడ్డ పుడ్తాడు?” అని వేళాకోళమాడారు. మీ వంశం నాశనం చేసే ముసలం” పుడుతుంది!” అన్నారు ఋషులు. వారు అన్నట్టుగానే జరిగింది. ఈ సందర్భంలో 36 సంవత్సరాలు అని గాంధారి ఎందుకు అన్నది? పది, ఇరవై, ముఫ్ఫై అనకుండా 36 ఏమిటి? ఈ ప్రశ్న చిరకాలం ఆలోచింప జేసింది.

విధి లేకనే ధర్మరాజును యువరాజుగా ప్రకటించారా?
విధి లేకనే ధర్మరాజును యువరాజుగా ప్రకటించారా?

యాదవ పాంచాలుర ప్రమేయంతోనే ద్రౌపదితో వివాహమై పాండవులు హస్తినకు వచ్చిన తరువాత.. పాండవులకు వాళ్లు జయించుకొని వచ్చిన రాజ్యాలూ(అపుడే అర్జునుడికి “ధనం జయుడు” అనే బిరుదనామం వచ్చింది), పాండురాజు జయించిన రాజ్యాలు చేర్చి అర్ధరాజ్య విభాగం కొత్తగా చేసి ఇచ్చారు. అది కూడా 5 సంవత్సరాలు తాత్సారం చేసి విధిలేని పరిస్థితిలో ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. వారణావతంలో లక్క యింట తగలబెట్టే పనికి ముందే నిజమైన వారసుడైన ధర్మరాజును రాజును చేయాలనే ఒత్తిడి తన కులపెద్దల నుంచి రావడంతో విధిలేక నాడు “యువరాజు”ను మాత్రమే చేసి, కాలయాపన చేశాడు ఆ పెదతండ్రి. పరస్పర వైరాలు కౌరవ పాండవుల మధ్య రోజు రోజుకూ పెరిగి పోతూన్నందువల్ల ఈ అర్ధ రాజ్య విభాగం అపుడు అనివార్యమయింది. భీష్ముడు మొదలగు పెద్దలకు ఈ పని చేయక తప్పనిదయింది.

Share this post with your friends