పరోపకారం చేసే వారికి సైతం కీడు తలపెడతారని చెప్పే భర్తృహరి శ్లోకమిది..

శ్లో𝕝𝕝 మృగమీనసజ్జనానాం తృణజలసన్తోషవిహితవృత్తీనామ్।
లుబ్ధకధీవరపిశునా నిష్కారణవైరిణో జగతి॥

పరోపకారం చేసే వారికి సైతం కీడు తలపెడతారని చెప్పే భర్తృహరి శ్లోకమిది..
పరోపకారం చేసే వారికి సైతం కీడు తలపెడతారని చెప్పే భర్తృహరి శ్లోకమిది..

పై శ్లోకాన్ని భర్తృహరిమహాకవి చెప్పాడు. దాని అర్థమేంటో తెలుసుకుందాం. అడవుల్లో గడ్డి తిని జీవించే లేళ్లు జింకలు, సముద్రల్లో నదుల్లో ఇతర జలాశయాల్లో స్వేచ్ఛగా జీవించే చేపలు – ఇవి ఎవరికీ హాని తలపెట్టవు. వాటి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అవి జీవిస్తుంటాయి. కానీ వేటగాడు, జాలరి వాటికి హాని తలపెడతాడు. అలాగే ఈ సమాజంలో సజ్జనులు కూడా వారి సహజశైలిలో పరహితం కోరి నిత్యం పరోపకారం చేస్తుంటారు. అయిననూ అటువంటివారికి కీడు తలపెట్టాలని కొందరు దుర్మార్గులు ఉంటారు కదా. అని పై శ్లోకానికి అర్థం.

Share this post with your friends