Trimbakeshwar Temple Unknown Facts : ఒకే పానవట్టంపై త్రిమూర్తులు కొలువుదీరడానికి కారణమిదే..

గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆవు మరణించడంతో గో హత్య మహా పాతకమని ఋషులంతా భయపెట్టి.. దీనికి పరిష్కారంగా గంగను తమ ప్రాంతానికి తీసుకురమ్మని కోరుతారు. దీంతో గౌతముడు, అహల్య దంపతులు శివుని కోసం వేల ఏళ్ల పాటు తపస్సు చేస్తారు. చివరకు పరమేశ్వరుడు తను ఒక్కడే కాకుండా బ్రహ్మ, విష్ణుమూర్తితో పాటు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తమ ప్రాంతంలో గంగానది ప్రవహించేలా చేయమని గౌతమ మహర్షి కోరగా.. తన జటాజూటం నుంచి గంగను తీసి పరమేశ్వరుడు విసిరేశాడట. అప్పుడు గంగమ్మ పరవళ్లు తొక్కుతూ బ్రహ్మగిరి పర్వతపై పండిందట.

Trimbakeshwar Temple Unknown Facts
Trimbakeshwar Temple Unknown Facts

బ్రహ్మగిరి పర్వతం పై నుంచి గంగ ప్రవహిస్తూ కిందకు వచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని పునీతం చేసింది. గౌతమ మహర్షి కారణంగా ఆ ప్రాంతానికి వచ్చింది కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ నదిని గౌతమి లేదంటే గోదావరి అనే పేరు వచ్చింది. ఇక గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కాబట్టి త్రయంబకేశ్వర క్షేత్రంలోని పానవట్టంపై పరమేశ్వరునితో పాటు బ్రహ్మ విష్ణువులు సైతం ఒకే పానవట్టంపై లింగాకారాల్లో దర్శనమిస్తారు. అలా ఈ క్షేత్రానికి త్రయంబకం అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడ ఆది పరాశక్తితో పాటు ముక్కోటి దేవతలు ఇక్కడే వెలిశారని చెబుతారు.

Share this post with your friends