సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు.. ఏంటంటే..

మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో సూర్యుడు ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టిన రోజు కాదు.. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది.

ద్వాదశ రాశులలో సంచారం..

విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే ఒక సంవత్సరం, అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి, సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు.

Share this post with your friends