Animals In Dreams : కలలో ఈ ఏడు జంతువులు కనిపిస్తున్నాయా… మీ జీవితం మారిపోయినట్టే

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఏడు జంతువులు కనిపిస్తే అదృష్టం, శక్తి, రక్షణ సంకేతాలు ఉంటాయి. ఏనుగు కలలో కనిపించడం బలం, శ్రేయస్సు, భగవంతుని ఆశీర్వాదానికి సూచికగా చెబుతారు. ఆవు పవిత్రత, రక్షణ, జాగ్రత్తగా జీవించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. కోతులు చురుకుదనం, భక్తి, మార్గదర్శకత్వానికి సంకేతంగా చెబుతారు. ఇక సింహం ధైర్యం, బలం, నాయకత్వం, భగవంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. పక్షులు స్వేచ్ఛ, ఆధ్యాత్మిక మార్గదర్శనం, ఆందోళనల నుండి విముక్తి కలుగుతాయని తెలియజేస్తుంది. చేప కలలో కనిపించడం శుభం, అదృష్టం, ప్రయత్నాలు ఫలప్రదమవుతాయని చెప్పడానికి చిహ్నం. నెమలి సృజనాత్మకత, జ్ఞానం, సరస్వతి దేవి ఆశీర్వాదానికి సంకేతం. కలలో కనిపించే ఈ జంతువులు జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని స్వప్నశాస్త్రం చెబుతున్నది.

Spiritual Meaning Of Animals In Dreams
Spiritual Meaning Of Animals In Dreams
Share this post with your friends