పార్వతీమాతను శివుడికి ఇచ్చి వివాహం చేయదలచినప్పుడు అమ్మవారు కొన్ని కండీషన్స్ పెట్టిందట. అవేంటంటే.. వివాహానంతరం తాను ఎలా ప్రవర్తించినా ఏమీ అనకూడదని చెప్పిందట. అలాగే ఆయన చెప్పిందల్లా తాను విననని.. తాను ఎలా తిరిగినా ఆంక్షలు విధించడానికి లేదని చెప్పిందట. అసలు ఆయన చెప్పిందల్లా తాను విననని పార్వతీ మాత ఎందుకు చెప్పింది? అసలు అలా చెప్పింది పరమేశ్వరుడి గురించేనా? బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వ్యాస భగవానుడు దీని గురించి ఏం చెప్పారు? వంటి విషయాలను తెలుసుకుందాం.

పార్వతీమాతను శివయ్యకు ఇచ్చి వివాహం చేయాలని మహర్షులంతా తలచారట. దీంతో ఆమె కండీషన్స్ పెట్టిందట. శివయ్య కూడా తన కండీషన్స్‌కు ఓకే చెప్పాడట. ఆ తరువాత వారిద్దరికీ వివాహం జరిగిందట. ఇక అమ్మవారు ఆయన చెప్పినట్టుగా తాను వినను అనడానికి కారణం.. శివయ్య గురించి కాదట. దుష్టులు చెప్పినట్టు తాను విననని చెప్పిందట. మాయ రూపంలో భక్తులు కొందరు ఉంటారు కాబట్టి వారు చెప్పినట్టు తాను విననని చెప్పిందట. ఇచ్చా శక్తి, క్రియా శక్తి అని రెండు ఉంటాయట. అమ్మవారు ఇచ్చా శక్తి. అంటే మనం కోరిన కోరికలు తీర్చే తల్లి అమ్మవారు. తొలుత అమ్మవారు ఇచ్చా శక్తి రూపంలో కోరిక కలిగిస్తుందట.
