శ్రీకృష్ణుడిపై గాంధారికి అంత కోపం ఎందుకంటే..

కౌరవులతో ఆడిన మాయా జూదంలో పాండవులు రాజ్యాలు కోల్పోయారు. అరణ్యవాసం ప్రారంభమైన తొలి రోజులలో శ్రీ కృష్ణుడు వాళ్లను కలుసుకొన్నపుడు ఆగ్రహావేశంతో.. ”ఇపుడే హస్తినకు వెళ్లి భీష్మాదులతో మాట్లాడి ధర్మరాజును పదస్థుణ్ణి చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఒప్పుకోకుంటే యాదవ పాంచాలురతో కలిసి యుద్ధం చేసి, జయించి ధర్మం నిలుపుతాను” అంటాడు. అయితే శ్రీకృష్ణుడిని అప్పటికి అర్జునుడు ఆపుతాడు. (జూదంలో ఓడాము కాబట్టి 13 సంవత్సరాలు పూర్తి కాకుండా అందుకు పూనుకోగూడదని పాండవుల ఆలోచన). అందుచేత అపుడు కృష్ణుడు విరమించాడు. కాబట్టి పాండవులకు ఏ కొంచెము రాజ్యమూ ఇవ్వడం.. ఏనాడూ కౌరవ శతానికీ, వాళ్ల తల్లిదండ్రులకు కించిత్తు కూడా ఇష్టం లేదనేది నాటి పెద్ద వాళ్లందరికీ తెలిసిన సత్యం.

శ్రీకృష్ణుడిపై గాంధారికి అంత కోపం ఎందుకంటే..
శ్రీకృష్ణుడిపై గాంధారికి అంత కోపం ఎందుకంటే..

తనకు పరాభవం జరగబోయే ముందు ద్రౌపది తనను రక్షించమని గాంధారి వెనుక భయంతో దాక్కున్నది. అంతటి విపత్తులోనూ ఇంటి పెద్ద కోడలిని రక్షించబూనుకోలేదు ఈ గాంధారి. ఎట్లయినా సరే తన బిడ్డలే రాజ్యానికి వారసులు కావాలనే పేరాశ ఆ తల్లికీ లేక పోలేదు. రాజసూయ వైభవం పాండవులకు కలగడం, కృష్ణుడు అవన్నీ వాళ్లకు కలిగించడం.. తన బిడ్డలకు ఆ గౌరవం కలగకపోయెనే అనే బాధ కూడా ఆ తల్లి హృదయంలో లేవనలేము. ఇంద్ర ప్రస్థంలో 23 సంవత్సరాల పాండవ వైభవానికి శ్రీకృష్ణుడే మూలకారణం అని ఆమె ఆగ్రహం కావచ్చు. అలాగే ధర్మరాజు పుట్టాడని వినగానే గర్భవిచ్ఛిత్తి స్వయంగా చేసుకున్న క్రౌర్యం వెనుక తనకు ముందు బిడ్డ పుడితే.. వాడు కౌరవ సామ్రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యే అవకాశం కలుగుతుందనే ఆశే కారణం.

Share this post with your friends