Black Magic SCARE : మూడు రోడ్ల కూడలిలో నిమ్మకాయలను ఎందుకు తొక్కకూడదు? | Nimmbu Mirchi On Indian Roads

మూడు బాటల దగ్గర కొన్నిసార్లు నిమ్మకాయలు, మిరపకాయలు పెట్టి వాటిపై పసుపు, కుంకుమ వేసినవి మనకు కనిపిస్తాయి. వాటిని తొక్కకూడదని.. వాటిని దాటకూడదని పెద్దలు చెబుతుంటారు. పెద్దలు చెప్పారు కాబట్టి మనం ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ అసలు కారణం ఏమిటనేది మాత్రం మనకు తెలియదు. అసలు అదేంటని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాతకాలంలో పెద్దలు నిమ్మకాయలు, మిరపకాయలతో దిష్టి తీసే పద్ధతిని ఆరంభించారు. ఇప్పటికీ మనం వాటిని ఫాలో అవుతున్నాం.

Nimmbu Mirchi On Indian Roads
Nimmbu Mirchi On Indian Roads

దిష్టి తీయడం పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయలు, మిరపకాయలను దూరంగా మూడు రోడ్లు కలిసే ప్రదేశంలో వేస్తుంటారు. అవి చెడు శక్తులను గ్రహించాయని నమ్ముతారు కాబట్టే వాటిని తొక్కినా లేదంటే దాటినానెగటివ్ ఎనర్జీ మన మీదకు వచ్చి దుష్ప్రభావం మనల్ని అంటుకుంటుందని పెద్దలు హెచ్చరిస్తూ ఉండేవారు. అంతేకాకుండా మూడు బాటల దగ్గర దయ్యాలు తిరుగుతాయన్న మాటలు కూడా ఆ నమ్మకాల నుంచే వచ్చాయి. ఆ ప్రాంతాలు పాతకాలంలో వెలుతురు లేక చీకటిగా ఉండటంతో పాటు.. జంతువులు, పాములకు ఆవాసంగా ఉండేవట. ఆ ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రజలను భయపెట్టి దూరంగా ఉంచారని పరిశోధకులు చెబుతున్నారు.

Share this post with your friends