శ్రీ రాముడు గొప్పవాడా? కృష్ణుడు గొప్పవాడా?

ఒకసారి అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ప్రయాణంలో ఆంజనేయుని కలుసుకున్నాడు. ఇద్దరూ పరస్పర కుశలప్రశ్నలు అడిగి, కురుక్షేత్ర సంగ్రామం గురించి మాట్లాడసాగారు. అర్జునుడు గర్వంగా “శ్రీకృష్ణుడే అందరిలో గొప్పవాడు! అతడు ఉన్నందునే మేము ఆ మహాసంగ్రామంలో విజయం సాధించాము” అన్నాడు. ఆ మాట ఆంజనేయుడికి నచ్చలేదు. అతను చిరునవ్వు చిందించి.. “మా ప్రభువు శ్రీరాముడి ముందు కృష్ణుడు ఎంతటివాడు?” అన్నాడు. అప్పుడు అర్జునుడు.. “అంతటి శక్తివంతుడైన రాముడు సేతువును తానే ఎందుకు నిర్మించలేదు? అని ప్రశ్నించాడు.

తన ధనుర్విద్యా కౌశలంతో సముద్రం మీద వంతెన కట్టవచ్చుకదా! వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడు?” ఆ మాట ఆంజనేయుడి చెవుల్లో మెరుపులా పడింది. అతడు ఉత్సాహంగా.. “అర్జునా! నువ్వు ధనుర్విద్యలో ప్రావీణ్యుడు కదా, నీ బాణాలతో వంతెన నిర్మించు. దానిపై నేను నడుస్తాను. అది కూలకపోతే నేనోడి అయినా సరే! కూలిపోతే నీవు నీ ప్రాణం త్యజించాలి” అన్నాడు. ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు. అర్జునుడు కృష్ణ పరమాత్మను స్మరించి తన బాణాలతో సేతువును నిర్మించాడు. హనుమ ఆ వంతెనపై నడిచాడు, గంతులు వేశాడు, తన బలమంతా ఉపయోగించాడు. వంతెన కదల్లేదు! అప్పుడేం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends