అమ్మవారు దేవతలకు, పితృదేవతలకు అన్నం పెడుతుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా స్వధా, స్వాహా రూపంలో పితృదేవతలు, దేవతల రూపంలో జగన్మాత అన్నం పెడుతుందట. స్వధా రూపంలో పితృదేవతలకు అన్నం పెడుతుందని అంటారు. అయితే పితృదేవతలకు మనం పిండాలను సమర్పిస్తూ ఉంటాం. ముఖ్యంగా మూడు పిండాలను సమర్పిస్తాం. అవి వసు, రుద్ర ఆదిత్య రూపాల్లో సమర్పించడం జరుగుతుంది. మూడు పిండాలను పితరులకు పెడితే.. అవే ఏడాదంతా పితృదేవతలు ఆహారంగా స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారట.

ఇక జగన్మాత స్వాహా రూపంలో దేవతలకు అన్నం పెడుతుందని అంటారు. యజ్ఞం వంటివి మనం చేస్తూనే ఉంటాం. దేశం సుభిక్షంగా ఉండాలని లేదంటే మన గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆలయాల్లో యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటప్పుడు యజ్ఞం నుంచి వెలువడే పొగ మేఘాల్లోకి వెళ్లి వర్షంగా మారి తిరిగి నేలను చేరుతుంది. తద్వారా పంటలు బాగా పండుతాయి. అందరికీ భోజనం దొరుకుతుంది. అలా అమ్మవారు మనకు కూడా ఆహారం అందేలా చేస్తుందని చెబుతారు. అందుకే స్వాహా రూపంలో అమ్మవారు భోజనం పెడుతుందని అంటారు.
