దత్తాత్రేయునికి అరటి పువ్వు తిలకాన్ని ఎలా దిద్దాలంటే..

అరటి చెట్టు నుంచి పువ్వులను గురువారం తీసుకువచ్చి అరటి తిలకాన్ని గురువారమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తయారు చేసుకున్న తిలకాన్ని ఒక సీసాలో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనిని దానిమ్మ పుల్ల, వెండిపుల్ల లేదంటే బంగారు పుల్లతో నుదుటన బొట్టుగా పెట్టుకోవాలి. ప్రతి రోజు ఉదయం స్నానం చేసి శుచిగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలా పూజ చేసుకునేందుకు వెళ్లడానికి ముందుగానే అరటి పువ్వు బొట్టును పెట్టుకొని పూజాదులు జరుపుకుంటే సత్ఫలితాలు వస్తాయి. అరటి పువ్వు తిలకధారణ ఫలితమేంటో తెలుసుకుందాం.

దత్తాత్రేయునికి అరటి పువ్వు తిలకాన్ని ఎలా దిద్దాలంటే..
దత్తాత్రేయునికి అరటి పువ్వు తిలకాన్ని ఎలా దిద్దాలంటే..

నిత్యం అరటి పువ్వు తిలకధారణ చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి.. మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని చెబుతారు. దాంపత్య జీవితంలోనూ అన్యోన్యత పెరుగుతుందట. శత్రువులు కూడా మిత్రులు అవుతారట అలాగే ఏవైనా ప్రయాణాలు చేపట్టినా కూడా విజయవంతం అవుతాయి. వృత్తిలో పురోగతి, ధన లాభాలతో పాటు.. వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందడంతో పాటు అవివాహితులకు వివాహ యోగం కలుగుతుందని చెుబతారు. వివాహితులకు సత్సంతానం.. రాజకీయాలలో రాణించాలనుకునే వారికి మంచి గుర్తింపు.. పదవీయోగం కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అరటి పువ్వు తిలకధారణ గురుగ్రహ దోషాన్ని నివారించే శక్తివంతమైన పరిహారమని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.

Share this post with your friends