దత్తాత్రేయ తిలకాన్ని ఎలా తయారు చేస్తారు?

దత్తాత్రేయ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే.. దత్తాత్రేయ తిలక ధారణ చేయాలి. గురుగ్రహ దోష నివారణకు సైతం శక్తివంతమైన పరిహారంగా దత్తాత్రేయ తిలక ధారణను పేర్కొంటారు. మరి ఆ తిలకాన్ని ఎలా తయారు చేయాలి? ఎప్పుడు తయారు చేయాలో తెులసుకుందాం. ఈ తిలకాన్ని గురువారం రోజు మాత్రమే తయారు చేయాలని చెబుతారు. ఈ దత్తాత్రేయ తిలకాన్ని అరటి పువ్వు తిలకం అని కూడా అంటారు. అరటి చెట్టు అనేది గురు గ్రహానికి ప్రతీకగా పేర్కొంటారు. గురువు అనుగ్రహం కోరుకునే వారు అరటి చెట్టును పూజించాలి.

దత్తాత్రేయ తిలకాన్ని ఎలా తయారు చేస్తారు?
దత్తాత్రేయ తిలకాన్ని ఎలా తయారు చేస్తారు?

అరటి పువ్వు తిలకం తయారు చేసేందుకు అరటి పవ్వులను తీసుకోవాలి. వాటిని సైతం గురువారం రోజున అరటి చెట్టు నుంచి తీసుకుని రావాలి. వాటిని నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కొత్త మట్టి కుండలో ఈ పువ్వులను వేసి పొయ్యిపై పెట్టి బాగా వేయించాలి. అరటి పువ్వులు పూర్తి స్థాయిలో నల్లగా మారిపోయేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత మెత్తగా పొడిగా చేసుకుని నూతన వస్త్రంలో వేసి జల్లించాలి. ఈ పద్ధతిని ‘వస్త్ర కాయం’గా పిలుస్తారు.. ఈ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం, సింధూరం, గోరోజనం, తుంగ గడ్డల పొడి, కుంకుమ, కొద్దిగా పసుపు, ఆవు నెయ్యి, కొద్దిగా పసుపు నీరు పోసి బాగా కలపాలి. అలా కలిపితే అది తిలకంలా తయారవుతుంది.

Share this post with your friends