హనుమంతుడు అప్పులివ్వడమేంటి? ఆ ఆచారం ఎలా ప్రారంభమైంది?

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా, బిబడోడ్ గ్రామంలో కొలువైన హనుమంతుడు భక్తుల అవసరాలకు అప్పులిస్తాడని తెలిసిందే. మరి అప్పులిచ్చే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. ఈ హనుమంతుని ఆలయంలో ఓ వింత ఆచారం ఉంది. అదేంటనేది ముందుగా తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం స్థానికంగా ఉండే ఆంజనేయస్వామి భక్తులందరూ పలువురు దాతల నుంచి విరాళాలు వసూలు చేసి తమ గ్రామంలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ తరువాత వారంతా కలిసి హనుమ ఆలయంలో ఓ గొప్ప యాగాన్ని నిర్వహించారు.

హనుమంతుడు అప్పులివ్వడమేంటి? ఆ ఆచారం ఎలా ప్రారంభమైంది?
హనుమంతుడు అప్పులివ్వడమేంటి? ఆ ఆచారం ఎలా ప్రారంభమైంది?

ఈ యాగం నిర్వహణ కోసం విరాళాలు అర్థించగా.. పెద్ద మొత్తంలో సమకూరాయి. యాగం నిర్వహించిన మీదట కూడా పెద్ద మొత్తంలో డబ్బు మిగిలిపోయిందట. దీంతో ఆ ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు కలిసి మంచి ఆలోచన చేశారు. యాగ నిర్వహణ అనంతరం మిగిన డబ్బును గ్రామంలోని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలుగా ఇచ్చారట. అలా హనుమంతుడి నుంచి సొమ్ము అప్పుగా తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా బాగా కలిసొచ్చిందట. దీంతో వారు తీసుకున్న రుణాన్ని తక్కువ సమయంలోనే చెల్లించారట. అలా హనుమంతుడి నుంచి డబ్బు తీసుకుని ఏదైనా పని చేస్తే అద్భుతంగా కలిసి రావడంతో చిన్న, పెద్ద వ్యాపారులంతా ఎంతో కొంత మొత్తాన్ని హనుమ నుంచి అప్పుగా తీసుకోవడం ఆరంభించారు.

Share this post with your friends