శ్రీ కృష్ణుడిని గాంధారి ఏమని శపించిందంటే..

“ఋషీణాం పునరా ద్యానాం వాచం అర్థోఽనుధావతి ”

అని భవభూతి మహాకవి అంటాడు (ఉత్తర రామచరితమ్). మనమందరం ఒక విషయం అనుకొని దానికి తగినట్లే మాట్లాడుతాం. అయితే ఋషుల నోటి వెంట వాళ్లు అనుకోకుండానే మాటలు వస్తాయి. దాని ప్రకారమే జరుగుతుంది..అని! (అవి భవితవ్య ద్వారాలు). శ్రావణుని తండ్రి శాపం.. దశరథుడికి దుఃఖానికి బదులుగా ఆనందం కలిగించింది! ‘ముందు నాకు సంతానం కలుగుతుంది. తర్వాత గదా, పుత్ర వియోగంతో చావు! అని ఆ సంతోషం. శాపాలు అందరికీ తగలవు. వాటిని అవసరమైతే తప్పించి వేసే శక్తి గలవారి ముందు ఆ మాటలు సాగవు. శ్రీకృష్ణుడు అలాంటి శక్తిగలవాడు..! తన బిడ్డలందరూ మరణించారనే దుఃఖంలో ఉన్న గాంధారి పొలికలనిలో (యుద్ధం జరిగి శ్మశానమైన చోట) ఆగ్రహం పట్టలేక శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది.

శ్రీ కృష్ణుడిని గాంధారి ఏమని శపించిందంటే..
శ్రీ కృష్ణుడిని గాంధారి ఏమని శపించిందంటే..

అంతకు ముందే ధర్మరాజును, భీముణ్ణి చూసి గాంధారి తీవ్ర ఆగ్రహానికి గురైందట. అయితే వ్యాస మహర్షి మాటలతో కొంత శాంతించింది. దుర్యోధనాదుల శవాలను చూసిన ఆమె దుఃఖాన్ని ఆపులేకపోయిందట. ఆమె కోడళ్ళు అనుభవిస్తున్న నవ వైధవ్యవేదన ఇబ్బడి ముబ్బడి చేయడంతో పొంగి వస్తూన్న ఆక్రోశంతో “నీకు చేతనై ఉండి కూడా ఈ జ్ఞాతుల వైరాన్ని నీవు ఆపలేదు. వీళ్ళ చావుకు నీవే కారణం. మీ వంశం కూడా ఇలాగే దాయాదులు ఒకరినొకరు చంపుకొని, నేటికి 36 సంవత్సరాలు దాటిన నాడు ఇదే రోజుకు నాశనమవుతుంది! నీవు కూడా దిక్కు లేని చావు చస్తావు” అని గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది.

Share this post with your friends