మనిషి దేహంలో ఉన్న శక్తులు గురించి తెలుసా?

మనిషి దేహంలో కేవలం మాంసం, ఎముకల సముదాయం కాదు. లోపల అనేక స్థాయిల శక్తులు పని చేస్తున్నాయి. మనిషి శరీరంలో మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి.. ఆత్మశక్తి, జీవశక్తి, ఓజోశక్తి.

1. ఆత్మ శక్తి
ఆత్మ శక్తి అనేది మనిషిలోని అసలు స్వరూపం. ఇది శరీరానికి, మనస్సుకు, భావాలకు అతీతం. ఇది పుట్టదు… చావదు… మారదు. ఇది సాక్షిగా ఉంటుంది. మనం చేసే ప్రతి ఆలోచన, పని, అనుభవం చూసే శక్తి. మనం “నేను” అని అనుకునేది నిజానికి ఈ ఆత్మ శక్తే.

మనిషి దేహంలో ఉన్న శక్తులు గురించి తెలుసా?
మనిషి దేహంలో ఉన్న శక్తులు గురించి తెలుసా?

ఉదాహరణ:
శరీరం నిద్రపోతుంది, మనస్సు కలలు చూస్తుంది… కానీ ఈ రెండింటినీ చూసేది ఒక “సాక్షి” ఉంటుంది — అదే ఆత్మ.
ఆత్మ శక్తి = అసలు జీవ చైతన్యం

2. జీవశక్తి – ప్రాణ శక్తి…..
జీవ శక్తి అనేది శరీరాన్ని కదిలించే శక్తి.
ఇది లేకపోతే శరీరం జీవం లేని మృతదేహం అవుతుంది.
ఇది శ్వాస రూపంలో, రక్త ప్రసరణలో, జీర్ణక్రియలో పనిచేస్తుంది
యోగశాస్త్రంలో దీన్ని ప్రాణ శక్తి అంటారు
ఇది నాడుల (నాడీ వ్యవస్థ) ద్వారా శరీరమంతా వ్యాపించి ఉంటుంది

ఉదాహరణ:
మనము ఊపిరి పీల్చుకుంటున్నాం, గుండె కొట్టుకుంటోంది, ఆహారం జీర్ణం అవుతోంది — ఇవన్నీ జీవ శక్తి పని.
జీవ శక్తి = శరీరాన్ని నడిపించే ప్రాణ శక్తి

Share this post with your friends