చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమాః |
చందనచంద్రయోర్మధ్యే శీతలా సాధుసంగతిః ||
చందనం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. చంద్రుడు మనసుకు హాయిని ఇస్తాడు. కానీ సజ్జనుల సాంగత్యం మాత్రం జీవితం మొత్తానికి శాంతి, సద్బుద్ధి, ధర్మబుద్ధి, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అదే విధంగా.. దుర్జనుల సాంగత్యం అగ్నికంటే వేడిగా, విషంకంటే ప్రమాదకరంగా ఉంటుంది. వారి పరిచయం వల్ల మనస్సులో అశాంతి పెరుగుతుంది. కోపం, లోభం, ద్వేషం పెరుగుతాయి. తద్వారా ధర్మబుద్ధి నశిస్తుంది. మంచి అలవాట్లు చెడిపోతాయి. అపకీర్తి, దుఃఖం, భయం కలుగుతాయి చివరకు పతనానికి దారితీస్తుంది అందుకే శాస్త్రం చెబుతుంది.

సత్సంగతిః కిమ్ న కరోతి పుంసామ్
అంటే సజ్జన సాంగత్యం మనిషిని ఉన్నతుడిని చేస్తుంది.
అలాగే..
దుర్జనసంసర్గః సర్వనాశాయ కల్పతే
అంటే.. దుర్జనుల సాంగత్యం సంపూర్ణ నాశనానికి కారణమవుతుంది.
