
ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి వస్తువులను వాడుతూ ఉంటారు. అసలు మరణించిన వారి వస్తువులను వాడొచ్చా? వారి అన్ని వస్తువులనూ వాడొచ్చా? అంటే కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదట. అవేంటో తెలుసుకుందాం. మరణించిన వ్యక్తి దుస్తులను అస్సలు వాడకూడదట. అలా వాడితే వారి ప్రతికూల శక్తి మన మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వాటిని దానం చేయడమో లేదంటే పారేయడమో చేయండి. మరణించిన వారి ఆభరణాలను సైతం వాడటం మంచిది కాదట. వాటిలో మరణించిన వారి భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అలా నేరుగా వాడకుండా కరిగించి, కొత్త ఆభరణాలను తయారు చేయించుకోవచ్చు.
ఇక వాడకూడని వస్తువు గడియారం. మరణించినవారి గడియారం ఇంట్లో ఉంటే, ఆ కుటుంబీకులకు జీవితంలో స్థిరత్వం ఉండదట. కాబట్టి గడియారం వాడకపోవడమే మంచిదని చెబుతారు. కొందరు పెద్ద వాళ్లు ఇంట్లో పడక కుర్చీలను వాడతారు. వారు మరణించిన తర్వాత వారి పడక కుర్చీలతో పాటు మంచం వంటివి ఇంట్లో ఉంచుకోకపోవడమే ఉత్తమం. వీటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కారణంగా వాటిని ఇంట్లో ఉంచుకోకపోవడమే ఉత్తమం. అలాగే మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. అలా ఉంచితే వారికి ముక్తి అనేది లభించదట. కాబట్టి మరణించిన వారి ఫోటోలను ఇంటి దక్షిణ దిశలో పెట్టాలి.
