బ్రహ్మ దేవుని ఆదేశంతో వినాయకుడికి పొట్టకు ఆభరణంలా మారిన ఆదిశేషుడు

మొత్తానికి గణేశుడి దయతో ఆదిశేషుడు తన పూర్వ స్థానాన్ని అయితే పొందాడు. ఆ తరువాత సంతోషంతో గణపతిని సైతం తనను ధరించమని వేడుకున్నాడట. దానికి సమయం ఉందిలే అని చెప్పాడట. వినాయకుడు ఒకసారి ఉండ్రాళ్లు, కుడుములు బొజ్జ నిండా తినడంతో పొట్ట విరిగిపోయిందట. దీంతో అతని పొట్టను పాముతో కట్టేశారు. దీనిని వినాయకుడి కథలో కూడా మనం తెలుసుకున్నాం. ఈ సంఘటన జరిగినప్పుడు బ్రహ్మదేవుడు ఆదిశేషుడిని పిలిచి ఓ ఆదేశమిచ్చాడట.

అదేంటంటే.. వినాయకుని పొట్ట మరోసారి విరగకుండా పొట్టకు చుట్టుకుని ఉండమని.. అలాగే. భుజానికి జాజ్ఞోపవీతంగా ఉండమని ఆదిశేషుడిని ఆఙ్ఞాపించాడంట! ఆనాటి నుంచి ఆదిశేషుడు వినాయకుని శరీరానికి ఒక ఆభరణంలా మారాడని పురాణ కథలు చెబుతున్నాయి. వినాయకుడిని మనం సర్వకాల సర్వావస్థలయందు పూజించుకుంటాం. అలా నిత్యం పూజించుకుంటే చాలా మంచిదట. ముఖ్యంగా బుధవారం రోజు వినాయకుని షోడశ నామాలు చదువుకుని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయని పెద్దలు అంటారు.

Share this post with your friends