పురాణాల్లో మత్స్య జయంతికి సంబంధించిన మరో కథేంటంటే..

పురాణాల్లో మత్స్య జయంతికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు విష్ణు భక్తుడు మాత్రమే కాకుండా ధర్మ నిష్టా పరాయణుడు. ఒకరోజు సత్యవ్రతుడు కృతమాలా నదిలో స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నాడు. ఆ సమయంలో ఆయన దోసిట్లో ఒక చేపపిల్ల పడింది. రాజు దానిని తిరిగి నీటిలోనికి జారవిడిచాడు. మళ్లీ నీటిని దోసిలిలోకి తీసుకున్నప్పుడు కూడా చేతిలోనికి చేప వచ్చింది. తనను తిరిగి నీటిలో పడేయబోతున్న రాజుతో.. తాను నీటిలో ఉంటే పెద్ద చేపలు తినేస్తాయని.. దయచేసి నన్ను రక్షించమని వేడుకుంది. చేప మాటలు విన్న సత్యవ్రతుడు ఎంతో కరుణతో దానిని తన కమండంలో వేశాడు. మరుసటి రోజుకి ఆ చేప పిల్ల ఆ కమండలం పట్టనంత పెద్దది అయ్యింది.

పురాణాల్లో మత్స్య జయంతికి సంబంధించిన మరో కథేంటంటే..
పురాణాల్లో మత్స్య జయంతికి సంబంధించిన మరో కథేంటంటే..

వెంటనే రాజు.. దానిని చెరువులో వదిలిపెట్టాడు. కానీ మరుసటి రోజుకి ఆ చేప.. చెరువును మంచి పెద్దగా మారిపోయింది. ఇక చేసేదేమీ లేక రాజుగారు ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టాడు. సముద్రంలో విడిచిపెట్టిన చేప మరుసటి రోజుకి రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగిపోవడంతో అప్పుడు చేపను నీవెవరని సత్యవ్రతుడు అడిగాడు. రానున్న వారం రోజుల్లో ప్రళయం రానుందని.. సకల జీవకోటి నశిస్తుందని కాబట్టి వేదాలు, విద్యలు, బీజాలు, నాకు, బ్రహ్మకు నీ రక్షణ అవసరమని చెప్పింది. సమీపంలోనే సప్త రుషులతో కూడిన నావ ఉందని.. అలాగే అక్కడకు సర్పం వస్తుందని.. దానిని తాడుగా చేసుకుని నావ కొమ్ముకు కట్టేయని చెప్పింది. సత్యవ్రతుడు చేప చెప్పినట్టే చేశాడు. అప్పుడు ప్రళయం నుంచి వేదాలతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. మీనరూపంలో వేదాలను శ్రీహరి రక్షించిన రోజు కాబట్టి దీనిని మత్స్య జయంతిగా జరుపుకుంటున్నాం.

దక్షిణావర్త శంఖం ఆవిర్భావం:

విష్ణుమూర్తి మత్స్యావతారంలో సోమకుని సంహరించే సమయంలో పరమ పవిత్రమైన దక్షిణావర్త శంఖం వెలువడింది. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు దక్షిణావర్త శంఖాన్ని తాను ఉంచుకుని, వేదాలు బ్రహ్మకు అప్పజెప్పుతాడు. ఆనాటి నుంచి చైత్ర శుద్ధ పంచమి రోజును మత్స్య జయంతి జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.

Share this post with your friends