ప్రాచీన జ్యతిష శాస్త్రంలో గ్రహగతిని ఎలా తెలుసుకునేవారంటే..

ప్రాచీన భారతీయ జ్యోతిష–ఖగోళ శాస్త్రంలో ఉపయోగించిన ముఖ్యమైన యంత్రాలు (పరికరాలు). ఇవి ప్రధానంగా గ్రహగతి, కాలమానం, దిక్సూచి, నక్షత్రస్థితి లాంటి అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

1. గోళయంత్రం
భూమి, ఆకాశ గోళాన్ని ప్రతిరూపంగా చూపించే యంత్రం. గ్రహాల స్థానం, రాశులు, నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
2. చక్రయంత్రం
వృత్తాకారంలో ఉండే ఈ యంత్రం గ్రహాల గమనాన్ని గణించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా రాశిచక్ర స్థితి తెలుసుకోవడంలో ఉపయోగం.
3. చాపయంత్రం
ఇది ఒక వంకర ఆకారంలో ఉంటుంది. కోణాలను కొలవడానికి ఉపయోగిస్తారు. గ్రహాల ఎత్తు తెలుసుకోవడంలో సహాయపడుతుంది.
4. తుర్యయంత్రం
చాపయంత్రానికి అభివృద్ధి చెందిన రూపం. ఇది నాలుగు భాగాలుగా విభజించి ఖచ్చితమైన కొలతలు తీసుకునే విధంగా ఉంటుంది.
5. నాడీవలయం
సూర్యుని ఆధారంగా కాలాన్ని కొలిచే యంత్రం. ఇది ఒక రకమైన సూర్య ఘడియారం.
6. ఘటికాయంత్రం
ఇది నీటి ఆధారంగా కాలాన్ని కొలిచే పరికరం. పాత కాలంలో దీన్ని “జల ఘడియారం” అంటారు.

ప్రాచీన జ్యతిష శాస్త్రంలో గ్రహగతిని ఎలా తెలుసుకునేవారంటే..
ప్రాచీన జ్యతిష శాస్త్రంలో గ్రహగతిని ఎలా తెలుసుకునేవారంటే..

7. శంకువు
ఇది సూర్యుని నీడ ద్వారా సమయం మరియు దిశలు తెలుసుకోవడానికి ఉపయోగించే సులభమైన పరికరం.
8. ఫలకయంత్రం
సమతల పలక మీద గీతలు గీసి గ్రాల స్థితి తెలుసుకునే పరికరం. లెక్కలు సులభంగా చేయడానికి ఉపయోగపడుతుంది.
9. యష్టియంత్రం
ఒక కర్ర ద్వారా ఎత్తు, కోణం, దూరం కొలవడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణమైన ఖగోళ పరికరం.
10. సర్వతోభద్ర యంత్రం
జ్యోతిషంలో ముఖ్యమైన చక్రం. శుభాశుభ ఫలితాలు, దిక్కులు, నక్షత్రాల ప్రభావం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
11. దృవభ్రమయంత్రం
ధృవ నక్షత్రం ఆధారంగా దిశలు, గమనాన్ని అర్థం చేసుకునే యంత్రం.
12. ప్రతోదయంత్రం
గ్రహోదయం మరియు అస్తమయం గమనించడానికి ఉపయోగించే పరికరం. ఈ యంత్రాలు అన్నీ కలిపి ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో చూపిస్తాయి. అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా, ఈ పరికరాలతోనే ఖచ్చితమైన గణనలు చేసేవారు.

Share this post with your friends