గణపతి కోసం వెయ్యేళ్ల పాటు తపస్సు చేసిన ఆదిశేషుడు

శివుడు ఆదిశేషుడికి గర్వభంగం అయితే కలిగించాడు. తిరిగి తన శిరస్సున ధరించేందుకు సైతం ఇష్టపడలేదు సరికదా.. పూర్వ స్థానం కూడా ఇవ్వలేదు. దీంతో ఆదిశేషుడు ఆవేదన చెందాడు. తనకు పట్టిన దుర్గతికి దుఃఖిస్తూ ఆదిశేషుడు కైలాసం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు నారదులవారు కనిపించి ఆదిశేషుని ఆవేదనకు కారణమేంటని అడగ్గా… అప్పుడు ఆదిశేషుడు జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు నారదులవారు ఓ సలహా ఇచ్చారట. ‘తండ్రి ఆగ్రహించాడని వెళ్ళిపోద్దని.. ఆయన కుమారుడైన గణపతిని ఆశ్రయించమని చెప్పాడట.

గణపతి షడక్షర మంత్రాన్ని సైతం జపించమని ఆదిశేషుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడట. నారదుడు సూచన మేరకు ఆదిశేషుడు గణపతి షడక్షర మంత్రాన్ని జపించడం ప్రారంభించాడట. అలా వేయి సంవత్సరాలపాటు కఠోర తపస్సు ఆచరించాడట. ఆదిశేషుడి తపస్సుకు మెచ్చిన వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరగా.. జరిగింది చెప్పి తనకు పూర్వ స్థానమిప్పించమని కోరాడట. సరేనని గణపతి మాటిచ్చాడు. అయితే శివుడికి గణపతి నచ్చ చెప్పడంతో ఆదిశేషుడికి పూర్వ స్థాన మిచ్చాడు. దీంతో ఆదిశేషుడు పరమానంద భరితుడయ్యాడు.

Share this post with your friends