ఆగమ శాస్త్రం ప్రకారం బలిహరణం అంటే ఏమిటి?

ఆలయాల్లో బలిహరణం అనే ప్రక్రియ ఉంటుంది. దీని గురించి మనకు తెలుసు కానీ పూర్తి వివరాలైతే తెలియవు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

1. బలిహరణం
“బలి” = సమర్పణ
“హరణం” = పంపించడం

ఆగమ శాస్త్రం ప్రకారం బలిహరణం అంటే ఏమిటి?
ఆగమ శాస్త్రం ప్రకారం బలిహరణం అంటే ఏమిటి?

దేవుడికి నైవేద్యం చేసిన తరువాత, ఆ సమర్పణను క్షేత్రపాలకులు, దిక్పాలకులు, భూతగణాలకు పంచడం “బలిహరణం”.

ఎందుకు బలిహరణం చేస్తారు?
ఆలయ రక్షణ కోసం ప్రతి దేవాలయాన్ని కాపాడే క్షేత్రపాలక శక్తులు ఉంటాయి. వారిని సంతృప్తి పరచడం వల్ల ఆలయం రక్షితంగా ఉంటుంది.

2. భూతగణాల శాంతి కోసం మనకు కనిపించని శక్తులు (భూతాలు, ప్రేతాలు) కూడా ఈ సృష్టిలో భాగమే. వాటిని నిర్లక్ష్యం చేస్తే అశాంతి వస్తుంది, కాబట్టి బలి ఇచ్చి శాంతింపజేస్తారు.

3. శక్తి సమతుల్యం..
గర్భగుడిలో దేవుని శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఆ శక్తిని బయటకు పంపి సమతుల్యం చేయడం కోసం బలిహరణం చేస్తారు.

4. పూజ సంపూర్ణత కోసం దేవుడికి మాత్రమే కాకుండా, సృష్టిలోని అన్ని శక్తులకు నైవేద్యం పంచినప్పుడు పూజ పూర్తి అవుతుంది.

5. దిక్పాలకులకు గౌరవం ఎనిమిది దిక్కులను కాపాడే దిక్పాలకులకు కూడా బలి ఇస్తారు. “ఈ పూజ సర్వలోకాలకు చెందింది” అనే భావం.

Share this post with your friends